కాంతిరేఖ

 జీవితం


జీవితం.. 
ఎగసి పడే కెరటం 
ఆనందం..
ఉవ్వెత్తున నింగికి ఎగరేస్తుంది 
విషాదం.. 
ఉస్సురని అంతరంగాన్ని కూలుస్తుంది 
రెండింటిలోనూ..
కనుల కొలనుల కొనలలో
ఉబికేది కన్నీరే..
జీవితం..
నిరంతరం భ్రమించేటి నాణెం
నాణేనికి ఒక వైపు..
రంగుల  కల లాంటి మోదం
మరో వైపు..
కలచేదిరిన క్షణాలే ఖేదం
మోదం, ఖేదం..
ఆవ్రుతమైతే జీవిత వలయం
కానప్పుడు అది జీవన్మరణం
జీవితం..
వెలుగు చీకట్ల సంగమం
కనులకు మిరిమిట్లు గొలిపే
కాంతిరేఖ ఆనందం
అంధకార బందురమై
అలుముకొంటుంది విషాదం
తరచి చూస్తే
ఒకటి రెండవ దాని వెంటే ఉంటుంది
జీవితం..
ఒక కలువ మానసం
కలువ మనసు దోచేటి
వెన్నెల జల్లు ఆనందం
ఆ వన్నెల వెన్నెల రాకను
స్వాగతించేటి
చిక్కని రాత్రి విషాదం
రెండూ పరస్పరాదారాలే..
నిరాదారమైతే
రెండింటి ఉనికి గల్లంతే..
జీవితం..
సెలయేటి గలగలల సంగీతం
ఉరుకుల పరుగుల నీటి ఉరవడిలో
అణువణువునా 'ఆనంద' రాగం
ప్రవాహంతో పరుగెత్తలేక
అలసిపోయి అరిగిపోయే
రాళ్ల మది నిండా విషాద తాళం
రాగం తాళం కలిస్తేనే సంగీతం
ఆనంద విషాదాల కలయికే జీవితం..
*************

     


మనసా..


మనసా.. ఓ మనసా.. 
నీ  విలువెంతో నీకు తెలుసా..
బ్రతుకే భారమై,బానిసై
భరించలేని క్షణాన
చప్పున నువ్వు గుర్తొస్తావు
నిట్టూర్పుల నిప్పులలో
నిజాల నిష్టూరాల ఊబిలో
చిక్కుకునేదీ నువ్వే
భాద్యతలకు బందీగా
భాదలకు బానిసగా
ఎన్నాళ్ళు ఉంటావు 
ఏ ఉద్యమమో, ఏ విప్లవమో
నిను విడిపిస్తుందా
ఏ ఆలోచనల వల్లరైనా 
నిను అలరిస్తుందా
ఏ కన్నుల విందైనా
నిను కదిలిస్తుందా
ఏ హర్షంబర వర్షమైనా 
నీ తీరు మారుస్తుందా
ఏ ఆద్యాత్మిక పర్వమైనా
నీ స్థిరాస్తి అవుతుందా 
ఏ అనురాగ బందాలైనా
నీకు భరోసా యిస్తాయా
నీ చుట్టూ ఉండేవి ఏవీ
నిజం కావన్నది పచ్చి నిజం
కనుక మార్చేది, మారేది
నిన్ను, నువ్వే....
**********

4 comments:

  1. mi blog chusanu :-). chaalaa sradda gaa design chesaru....baagundi. "paalakonda" ante ekkada?"ye adyatmika parvamainaa nee stiraasti avutundaa"....baagundi. continue cheyandi....

    ReplyDelete
  2. chaala santhosamgaa undi subhashini gaaru.. thank you so much for giving first comment to my blog.....

    ReplyDelete
  3. hi sir hru.me blog chala badundi,net valla me blog chusanu naku chala hpy ga undi.

    ReplyDelete
  4. thank you sivaji.. iam so happy to see your comment

    ReplyDelete