Friday, April 8, 2011

మేలుకో.. మిత్రమా..

మిత్రమా..
అందరి మనసుల్ని ఆవరించిన 
కులమతాల అవరోధాలను 
అమాంతం ఎప్పుడు అధిగమిస్తావు..
అవినీతి అంటువ్యాదిలా 
అన్నివైపులా అల్లుకుపోతుంటే
ఆసాంతం ఎన్నాళ్ళని చూస్తుంటావు..
అనవసరమైన  ఆవేశాలతో 
అన్నదమ్ముల మధ్య అనైక్యత ను పెంచే 
అరాచక శక్తులను ఎప్పుడు అణచివేస్తావు.. 
ఆత్మవంచనను జయించి 
ఆశల అశ్వాలనధిరోహించి
ఆకాంక్షలే ఆలంబనగా ఎప్పుడు నడుస్తావు 
అణువణువునా ఆత్మవిశ్వాసంతో 
అలుపెరుగని అవిశ్రాంతశ్రామికుడివై 
అనితర సాధ్యమైన అభ్యున్నతిని 
అవలీలగా నీవు అధిరోహించాలని 
అడుగడుగునా ఆంధ్రమాత కన్నకలల్ని
ఆకారంగా సాకారం చేస్తావని 
మనసారా కోరుకుంటూ.. 
                             నీ..
                                  శ్రేయోభిలాషి  


2 comments:

  1. మామా నువ్వు పాపాత్ముడివి రా!!!
    పాపాత్ముడు - పాపనే ఆత్మగా గలవాడు (కలది, కలవాడు - బహువ్రీహి సమాసం)
    సరిగ్గా అతికినట్లు సరిపోయింది కదూ...

    ReplyDelete
  2. మామా... నువ్వు నిజంగా నన్ను బాగా అర్థం చేసుకున్నావు. థాంక్స్.. నీ కామెంట్ చదివి బాగా నవ్వుకున్నాను. నా కవిత కంటే నీ సమాసం బాగుంది..

    ReplyDelete