మిన్ను విరిగి
మీద పడుతుంటే
కనులు మూసుకుంటావేం...
కాల్బలం
తన్నుకు వస్తుంటే
ముడుచుకు కూర్చుంటావేం...
భవిత
బండలవుతుంటే
అదృష్టానికి
ఆశ పడతావేం...
పరగొంతులు
పరిహసిస్తుంటే
పరుగు పెడతావేం...
ఆవేశం
తన్నుకువస్తుంటే
నిద్ర నటిస్తావేం...
కదులు... ముందుకు
కదులు... ముందుకు
గమ్యం చేరేంతవరకు.
ANANTH GAARU MEE KAVITHA CHALA BHAGUNNAIE..MEE MUNDU NAA BHAVAM CHEPPALANTE KAVAALI "MEE PERANNI"AKSHARAALU.BABA DAYATHO MEERINKENNO RAYAALANI KORUKUNTU.......
ReplyDeleteMee Nalla Sai Reddy
SIR.. REDDY GAARU.. THANK YOU FOR YOUR COMMENT. MEERU EDAINA BLOG RASTUNNARA PLEASE MENTION IT. MEE PROTSAHAM UNTE ILANTI KAVITHALU INKENNO RAYAGALANU...
ReplyDeleteవిన్ను విరిగి న అది నేను ఇన్ని రోజులు మిన్ను విరిగి అనుకున్నానే తప్ప అండి అది
ReplyDelete